క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా మళ్ళీ తడబడింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ టెస్ట్ లో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ ని 242 పరుగుల వద్ద ముగించింది. మొదటి టెస్ట్ కంటే కాస్త పరవాలేదనిపించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు భారత జట్టుని ఆది నుంచి కట్టడి చేసింది. ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. 

 

ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ని స్వల్ప తేడాతో వైస్ కెప్టెన్ రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లీ ని అవుట్ చేసింది. ఆ తర్వాత మరో ఓపెనర్ పృథ్వీ షా, సీనియర్ ఆటగాడు పుజారా ఇద్దరూ జట్టుకి అండగా నిలిచారు. అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న షా, జేమిసేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రహానే స్వల్ప తేడాతో అవుట్ అయ్యారు. 

 

ఇక రహానే తర్వాత వచ్చిన హనుమ విహారితో కలిసి పుజారా 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డు ని జాగ్రత్తగా ముందుకి నడిపించారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విహారి దూకుడు గా ఆడుతుంటే మరో ఎండ్ లో పుజారా నెమ్మదిగా ఆడుతూ నిలబడ్డాడు. అయితే వీరిద్దరూ వెంట వెంటనే అవుట్ అవడంతో ఆ తర్వాత వచ్చిన పంత్, జడేజా, ఉమేష్ యాదవ్ నిలబడలేకపోయారు. చివర్లో భూమ్రా, షమి కాస్త ఫోర్లు సిక్సులతో మెరిపించడంతో 242 పరుగుల మెరుగైన స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో జేమిసేన్ కెరీర్ లో తొలిసారి 5 వికెట్లు తీసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: