ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి మరియా షరపోవా..  టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. రష్యాకు చెందిన షరపోవా ఇప్పటి వరకు.. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. మై లైఫ్‌ సో ఫార్‌.. అని రెండున్నరేళ్ల క్రితం మారియా షరపోవా తన బయోగ్రఫీ రాసుకున్నారు. ఆపలేని ఎదుగుదల.. అని. ఆ పుస్తకం బయటికి రావడానికి కొద్దినెలల  ముందే.. పదిహేను నెలల నిషేధం తర్వాత ఆమె మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చారు. రెండేళ్లు ఆడారు. అంతలోనే మళ్లీ రెండు రోజుల క్రితం రిటైర్‌మెంట్‌ని ప్రకటించారు. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. ఫామ్ కోల్పోవడం ఒక రీజన్ అయితే కొన్నేళ్ల కిందట ఈమె డోపింగ్ వివాదంలో చిక్కుకోవడం రెండో కారణం.

 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ముందు డ్రగ్‌ టెస్ట్‌ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అప్పటికి పదేళ్లుగా ఆమె తన ఆరోగ్యం కోసం తనకు తెలియకుండానే మెల్డోనియం కలిసి ఉన్న మెడిసిన్‌ని వాడుతున్నారు. వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ కొత్తగా విడుదల చేసిన నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది. అందుకు పడిన శిక్ష ఆట నుంచి పదిహేను నెలల బ్యాన్‌. దీంతో షరపోవాపై అప్పటి వరకూ ఉన్న క్రేజ్ చాలా వరకూ మాయమైంది. 

 

ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. అంతర్జాతీయ టెన్నిస్ ను ఒక దశలో ఏలింది షరపోవా. టెన్నిస్ లో ప్రైజ్ మనీలు భారీగా ఉంటాయి. ఇక టెన్నిస్ ప్లేయర్లకు ఇంటర్నేషనల్ ఇమేజ్ కూడా ఉంటుంది. దీంతో వారికి ఎండోర్స్ మెంట్స్ ద్వారా కూడా కోట్ల డాలర్లు లభిస్తాయి. ఈ క్ర‌మంలోనే  ఆమె ఆస్తుల విలువ భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఎంతలా అంటే.. ఈ టెన్నిస్ ప్లేయర్ మొత్తం ఆస్తుల విలువ సుమారుగా లక్ష కోట్ల రూపాయలు అని అంచనా వేస్తున్నారు. అయితే ఇక ముందు కూడా షరపోవా మార్కెటింగ్ చేసుకోగలదని ఆమె ఆస్తుల విలువ మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: