ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు విజయపరంపర కొనసాగిస్తూ అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ సేన ఇప్పుడు మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీ సేన ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. ఇక మిగతా ఆటగాళ్ల  పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ... టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు అనే చెప్పాలి. జట్టు మొత్తానికి కీలక ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ఇక మొన్నటికి మొన్న జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగిల్చడు. ఇక ఈరోజు జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కూడా కోహ్లీ అభిమానులందరినీ దారుణంగా నిరాశపరిచాడు.

 

 

 

 న్యూజిలాండ్లోని క్రీస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో... విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ ద్వారా మూడు  పరుగులకే వెనుదిరిగాడు. అయితే విరాట్ కోహ్లీ అవుట్ అయిన సమయంలో విరాట్ కోహ్లీ నిర్ణయం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీని  విమర్శల పాలు చేస్తోంది. అదేంటంటే విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యు అవుట్ అయిన సమయంలో... కోహ్లీ డిఆర్ఎస్ కు వెళ్ళాడు. అయితే అది అవుట్ అని  క్లియర్ గా తెలుస్తున్నప్పటికి కూడా ఎందుకు డిఆర్ఎస్ ను వృధా చేశారు అంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండో టెస్టులో కోహ్లీ కేవలం మూడు పరుగులకు అవుటయ్యాడు. 

 

 

 

 ఇక సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు అభిమానులు. క్రికెట్ అన్నది జట్టు గేమ్ అని... కోహ్లీ ఒక్కడే క్రికెట్ జట్టు కాదని... జట్టు గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సెల్ఫీ ఎల్పీడబ్ల్యూ క్లియర్ గా  అవుట్ అని తెలిసినప్పటికీ కోహ్లీ డీఆర్ఏస్  ను  వృధా చేసాడు అంటూ మండిపడుతున్నారు. అయితే టెస్టుల్లో 15 శాతం మాత్రమే కోహ్లీ నిర్ణయించిన డిఆర్ఎస్ నిర్ణయాలు సక్సెస్ సాధించాయని  గుర్తుంచుకోవాలి అంటూ కోహ్లీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టుకు కెప్టెన్ అయినంత మాత్రాన... జట్టు సమిష్టిగా ప్రయోజనాలను పక్కనపెట్టి పనికిరాని నిర్ణయాలు తీసుకుంటావా అంటూ మరొకరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కోహ్లీ రివ్యూకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు నెటిజన్లు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: