రెండో టెస్టు లో కూడా టీమిండియా ఆట తీరు ఏమాత్రం మారలేదు. బ్యాటింగ్ ,బౌలింగ్ లో పూర్తిగా విఫలమై మెదటి రోజు నిరాశపరిచింది. మొదట ఇన్నింగ్స్ లో భారత్  242 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఓపెనర్ పృథ్వీ షా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు పుజారా, విహారి హాఫ్ సెంచరీలు చేసి ఆదుకున్నారు. ప్రస్తుతం చెత్త ఫామ్ లో వున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరోసారి అదే ప్రదర్శన చేశాడు. కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్ చేరుకున్నాడు.   
 
ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్లాప్ షో ఈ మ్యాచ్ లో కూడా రిపీట్ అయ్యింది. ఎంత తొందరగా పెవిలియన్ కు చేరుకొంటే అంత మంచిదనట్లుగా పంత్ వ్యవహరించాడు. వీరితోపాటు అశ్విన్ స్థానంలో చోటు దక్కించుకున్న ఆల్ రౌండర్ జడేజా కూడా నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్ల లో జమైసన్ మొదటి సారి కెరీర్ లో 5వికెట్లు తీసుకోగా , బౌల్ట్ , సౌథీ 2 వికెట్లు పడగొట్టారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న వాగ్నెర్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. 
 
ఇక బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా టీమిండియా విఫలమైంది. 23 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయింది. ముఖ్యంగా ఇషాంత్ శర్మ లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడింది. అతని స్థానం లో జట్టులోకి వచ్చిన ఉమేష్ యాదవ్ ఏమాత్రం ప్రభావం  చూపలేకపోయాడు. ఇక బుమ్రా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తొలి రోజు అట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్ లేతమ్ (27*),టామ్ బ్లండెల్ (29*) క్రీజ్ లో వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: