గత మూడు సంవత్సరాల్లో భారత క్రికెట్ జట్టు యొక్క ప్రదర్శన ప్రపంచ దేశాలన్నింటినీ అబ్బురపరిచింది. ఫార్మెట్ ఏదైనా సరే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ప్రతి మెగా టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కూడా భారత్ ఇప్పటివరకు 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా వాటిలో 7 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదలైనప్పటి నుంచి తొలిసారి విదేశీ గడ్డపై అడుగుపెట్టిన భారత్ న్యూజిలాండ్ దాటికి విలవిలలాడుతోంది.

 

మొదటి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత్ రెండో టెస్ట్ లో అయినా పుంజుకుంటారని అభిమానులు ఆశించారు. క్రైస్ట్ చర్చ్ లో నేడు మొదలైన రెండవ టెస్ట్ లో భారత్ టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసి 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పృద్వి షా, పుజారా మరియు హనుమ విహారీ అర్థ శతకాలు సాధించినా.. వారంతా భారీస్కోరు చేయకుండా 60 పరుగుల లోపే వికెట్లు కోల్పోవడం భారత్ ను భారీగా దెబ్బ తీసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 పరుగులకే వెనుదిరిగి మరోసారి తన బలహీనతను చాటుకున్నాడు. కివీస్ బౌలర్లలో తన కెరీర్లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కైల్ జెమీసన్ 5 వికెట్లు పడగొట్టగా బౌల్ట్ మరియు సౌథీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

 

IHG

 

తర్వాత తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 63 పరుగులతో వికెట్ నష్టపోకుండా ఉంది. దాదాపు 23 ఓవర్లలో పాటు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. పచ్చిక ఉన్న పిచ్ పై కోహ్లీ టాస్ ఓడిపోవడం భారత్ కు ప్రతికూలాంశంగా మారిందని అందరూ చెబుతున్నారు కానీ పిచ్ బ్యాటింగ్ కు మరీ అంత కష్టతరమైనది కాదు అని అర్థమవుతోంది. మన భారత ఆటగాళ్లు అంతా చెత్త షాట్లు కొట్టి వికెట్లు పోగొట్టుకున్నారే తప్ప పిచ్చి మరీ అంత ప్రమాదకరంగా అయితే ఏమీ లేదు. కానీ న్యూజిలాండ్ ఓపెనర్లు మంచి పట్టుదల, నైపుణ్యత ప్రదర్శించి వికెట్ను కాపాడుకున్నారు.

 

IHG

 

గత కొద్దికాలంగా నిలకడ ప్రదర్శనతో ప్రపంచంలోనే మేటి జట్టు అనిపించుకున్న భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ లో ఘోరమైన ప్రదర్శన ఇవ్వడం చూసి టీమిండియా మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళిపోనుందా అన్న సందేహం భారత అభిమానులలో వ్యక్తమవుతోంది. ఇక రెండవ రోజు లో భారత బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచకపోతే టీమిండియాకు ఇంకొక ఘోర పరాభవం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: