రేపు క్రికెట్ లో మొత్తం 8 మ్యాచ్ లు జరుగనున్నాయి ఇందులో 5 అంతర్జాతీయ మ్యాచ్ లు కాగా మూడు దేశవాళీ మ్యాచ్ లు వున్నాయి.  అవేంటో ఇప్పుడు చూద్దాం...రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా శనివారం ఇండియా-న్యూజిలాండ్ ల మధ్య రెండవ టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా  మొదటి ఇన్నింగ్స్ లో  టీమిండియా 242 పరుగులకు ఆల్ అవుట్ కాగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్ట పోకుండా కివీస్ 63 పరుగులు చేసింది. రేపు రెండవ రోజు ఆట కొనసాగనుంది. ఇక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో శ్రీలంక రేపు మూడోవన్డే లో తలపడనుంది ఇప్పటికే సిరీస్ ను 2-0తో తేడాతో లంక గెలుచుకుంది. అలాగే జింబాబ్వేతో బంగ్లాదేశ్ స్వదేశం లో మూడు వన్డేల సిరీస్ లో తలపడనుండుగా రేపు ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరుగనుంది. ఇక మహిళ టీ 20ప్రపంచ కప్ విషయానికి వస్తే రేపు సౌతాఫ్రికా మెన్ టీం , పాకిస్థాన్ ఉమెన్ టీం తో తలపడనుండగా ఇంగ్లాడ్ ఉమెన్ టీం , వెస్టిండీస్ ఉమెన్ టీం ను ఢీకొట్టనుంది. 
 
ఇదిలావుంటే  దేశవాళీ విషయానికి వస్తే రంజీ ట్రోఫీ లో భాగంగా  మొదటి సెమిస్ లో గుజరాత్ , సౌరాష్ట్ర తలపడుతున్నాయి. శనివారం ఈమ్యాచ్ స్టార్ట్ కాగా సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 217పరుగులు చేసింది. రేపు రెండో రోజు ఆట కొనసాగనుంది. అలాగే రెండో సెమిస్ లో కర్ణాటక , బెంగాల్ జట్లు తలపడుతుండగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో బెంగాల్ 9వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఈమ్యాచ్ లో కర్ణాటక తరుపున టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగాడు. ఇక పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో భాగంగా రేపు ఇస్లామాబాద్ యునైటెడ్ మరియు కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: