ఇండియా -న్యూజిలాండ్ లమధ్య జరుగుతున్న రెండో టెస్టు రసకందాయంలో పడింది. ఈమ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రెండో రోజు పిచ్ పూర్తిగా ఫాస్ట్ బౌలర్ల కు సహకరించింది. దాంతో ఏకంగా ఆ ఒక్కరోజే 16వికెట్లు నేల కూలాయి. ఓవర్నైట్ స్కోర్ 63./0 బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ .. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కన్నా 7పరుగులు తక్కువే చేసి ఆల్ అవుట్ అయ్యింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో 200 దాటితే గొప్పే అనిపించింది అయితే చివర్లో టైలెండర్లు జమైసన్ (49), వాగ్నెర్ (21) పోరాడడం తో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్ల లో షమి 4, బుమ్రా 3, జడేజా 2 వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ కు కివీస్ బౌలర్లు చుక్కలు చూపించారు.  ముఖ్యంగా బౌల్ట్  ఊహించని రీతిలో బంతిని స్వింగ్ చేస్తూ భారత బ్యాట్స్ మెన్లను బయటపెట్టాడు. ఓపెనర్లు పృథ్వీ షా , మయాంక్ విఫలం కాగా కెప్టెన్ కోహ్లీ మరో సారి చేతులెత్తేశాడు. అయితే ఈదశలో రహానే తో కలిసి పుజారా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కానీ ఫలితం లేకపోయింది. 42బంతులను అతి మీద కష్టంగా ఎదుర్కొన్న రహానే 43 బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆతరువాత కాసేపటికే రెండు అద్భుతమైన బంతులతో బౌల్ట్..  పుజారా , ఉమేష్ యాదవ్ లను బౌల్డ్ చేశాడు. దాంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 6వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజ్ లో విహారి, పంత్ వున్నారు. ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే మాత్రం మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: