టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే ను న్యూజిలాండ్ బౌలర్లు జమైసన్, వాగ్నెర్ వణికించారు. వీరి దెబ్బకు రహానే ఆట గల్లీ క్రికెటర్ ను తలపించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కోహ్లి అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన రహానే తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు.  జమైసన్ ,వాగ్నెర్ పదే పదే  షార్ట్ పిచ్ బంతులతో రహానే ను భయపెట్టారు. ఇందులో కొన్ని  రహానే హెల్మెట్ కు కూడా తగిలాయి దాంతో బయపడి ఒత్తిడికి గురైన రహానే చివరికి వాగ్నెర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. అతి కష్టం మీద 42 బంతులను ఎదుర్కొన్న రహానే ఆతరువాతి బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇకమొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 75 పరుగులు చేసిన రహానే రెండో టెస్టు లో రెండు ఇన్నింగ్స్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమై నిరాశపరిచాడు. 
 
ఇదిలావుంటే రెండో టెస్టు తుది దశకు చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 6వికెట్ల నష్టానికి 90పరుగులు చేసి 97పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ ఆధిక్యాన్ని ప్రస్తుతం క్రీజ్ లో వున్న బ్యాట్స్ మెన్లు విహారి ,పంత్ 250 దాటిస్తే మ్యాచ్ భారత్ సొంతమైనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: