స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డే ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది శ్రీలంక. అందులో భాగంగా ఆదివారం జరిగిన  నామమాత్రమైన మూడో వన్డే లో వెస్టిండీస్ పై 6 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠత నడుమ సాగిన ఈమ్యాచ్ లో విండీస్ విజయం ముందు బోర్లా పడింది.  చివరి ఓవర్ లో వెస్టిండీస్ గెలుపుకు 13 పరుగులు అవసరం కాగా  అప్పటికే 13బంతుల్లో 33పరుగులు చేసి ఊపు మీద వున్న ఫేబియన్ అలెన్ క్రీజ్ లో ఉండడంతో  ఆజట్టు గెలుపు పక్కా అనుకున్నారు కానీ చివరి ఓవర్ మాథ్యూస్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి విజయాన్ని దూరం చేశాడు.   
 
ఆ ఓవర్ మొదటి బంతిని బౌండరీకి తరలించిన అలెన్ రెండో బంతికి అవుట్ అయ్యాడు ఆతరువాత 4బంతుల్లో కేవలం రెండు రన్స్ మాత్రమే వచ్చాయి. దాంతో విండీస్ ఓటమిని చవిచూ డాల్సి వచ్చింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50ఓవర్ల లో 307 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. కుశాల్ మెండిస్ (55), డిసిల్వా (51) అర్ధశతకాలతో రాణించగా విండీస్ బౌలర్ల లో అల్జారీ జోసెఫ్ 4, హోల్డర్ 2, వికెట్లు తీయగా కాట్రేల్, పోలార్డ్ చెరో వికెట్ తీసుకున్నారు.   
 
అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 50ఓవర్ల లో 9వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్ లలో హోప్ (72),సునీల్ అంబ్రీస్ (60), పూరన్ (50) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక బ్యాటింగ్ లో విఫలమైన శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ బౌలింగ్ లో అదరగొట్టి 4వికెట్లు పడగొట్టాడు దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా సిరీస్ ఆద్యాంతం రాణించిన హసరంగాకు ప్లేయర్ అఫ్ ది సిరీస్ లభించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: