రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తాజాగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్, భారత్ పై 7వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 242 పరుగులకు ఆల్ అవుట్ కాగా న్యూజిలాండ్ 235పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 124 పరుగులకు ఆల్ ఔటై కివీస్ ముందు 132పరుగుల లక్ష్యాన్ని వుంచింది. 33ఓవర్ల లో మూడు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 
 
బ్యాట్ తో మొదటి ఇన్నింగ్స్ లో 49పరుగులు చేసి ఆతరువాత బంతితో 5వికెట్లు తీసుకొని జట్టు విజయం లో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జమైసన్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ లభించింది.  అతనికిదే తొలి అంతర్జాతీయ టెస్టు సిరీస్ కావడం విశేషం. రెండు టెస్టుల్లో జమైసన్ 9వికెట్లు తీసుకొని 93 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సిరీస్ లో మొత్తం 14 వికెట్లు తీసిన స్టార్ బౌలర్ సౌథీ కి ప్లేయర్ అఫ్ ది సిరీస్ దక్కింది. 
 
ఇదిలావుంటే అవమానకర రీతిలో ఓడిపోయి టీమిండియా, న్యూజిలాండ్ పర్యటనను ముగించింది. ఈపర్యటనలో 5-0 తో టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఆ తరువాత 3-0తో వన్డే సిరీస్ లో వైట్ వాష్ చేయించుకుంది. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్ లోకూడా భారత్ కు న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ తప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: