ఐపీఎల్ 13వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని నేటి నుండి చెన్నై లోని చిదంబరం స్టేడియం లో ప్రాక్టీస్ లో పాల్గొననున్నాడు. అందుకోసం నిన్న రాత్రి చెన్నై కు చేరుకున్న ధోనికి విమానాశ్రయం లో ఘన స్వాగతం లభించింది. ఇక ఎప్పటికప్పుడు లుక్ ను మార్చుకోవడానికి ఇష్టపడే ధోని ఈ సారి కూడా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. కొత్త హెయిర్ స్టైల్ తో మునుపటి కన్నా మరింత యంగ్ గా కనిపించాడు ధోని.  ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో తీసిన ధోని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ధోని తో కలిసి చెన్నై ఆటగాళ్లు రాయుడు ,రైనా కూడా ప్రాక్టీస్ లో పాల్గొననున్నారు అయితే చెన్నై టీం రెగ్యులర్ ప్రాక్టీస్ మాత్రం మార్చి 19నుండి ప్రారంభం కానుందని సమాచారం. 
 
ఇక దాదాపు ప్రతి సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసుకుంటూ వస్తున్న చెన్నై ఇప్పటివరకు మూడు సార్లు ఛాంపియన్ గా  అవతరించింది. కాగా గత ఏడాది ఐపీఎల్ లో ఫైనల్ కు చేరుకొని తుది మెట్టు పై బోల్తా పడింది,. మరి ఈ సీజన్ లో చెన్నై ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29ప్రారంభం కానుండగా ఓపెనింగ్ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది చెన్నై. ముంబై లోని వాంఖడే వేదికగా ఈమ్యాచ్ జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: