కివీస్ పర్యటనలో టీం ఇండియా విఫలం కావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. తొలుత టి20 సీరీస్ లో విజయం సాధించిన టీం ఇండియా ఆ తర్వాత వన్డే సీరీస్ ని, టెస్ట్ సీరీస్ ని క్లీన్ స్వీప్ తో కోల్పోయింది. బలమైన జట్టు అయినా సరే టీం ఇండియా ఈ విధంగా ఆడటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇండియా లో మినహా ఇప్పటి వరకు ఏ దేశంలోనూ సరిగా టీం ఆడటం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. 

 

ముఖ్యంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో టీం ఇండియా ఘోరంగా ఫ్లాప్ అవుతుంది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్నా సరే టీం ఓటమి పాలవుతుంది. ఒకపక్క ప్రత్యర్ధి బ్యాటింగ్ బౌలింగ్ లో నిలకడగా ఆడుతున్నా అనుభవం ఉన్న ఆటగాళ్ళు అయినా సరే టీం ఇండియా సీనియర్లు ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమవుతుంది. 

 

బౌలింగ్ లో స్టార్ బౌలర్ గా పేరున్న జస్ప్రిత్ బూమ్రా ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. పేస్ గన్ గా పేరున్న బూమ్రా, సీనియర్ పెసర్లు శమీ, ఇషాంత్ శర్మ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనితో ఇప్పుడు మన వాళ్లకు ఐపిఎల్ మీద ఉన్న ఆసక్తి దేశం మీద ఆసక్తి లేదని అంటున్నారు. మరి ఈ ఏడాది ఐపియల్ లో మన వాళ్ళు చెలరేగిపోతారని, దాని మీద ఉన్న ప్రేమ మాములుగా దేశం మీద ఎందుకు ఉండటం లేదని, పేరు వచ్చే దేశం మీద ఆ మాత్ర శ్రద్ధ లేదా అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: