చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా  వైరస్ ప్రస్తుతం చైనా దేశంలో విలయ తాండవం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ కారణంగా కేవలం ప్రాణ నష్టం కాదు అన్ని రంగాల్లో  తీవ్ర ఆర్థిక  నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ నష్టం కేవలం చైనాలో  మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో మీద ప్రభావం చూపుతుంది. ఓవైపు కరోనా ఎఫెక్ట్ తో అటు  స్టాక్ మార్కెట్లు కూడా  ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి . మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది. ఇలా ఈ ప్రాణాంతకమైన వైరస్ కారణంగా ఎన్నో కష్టాలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ కు ఎలాంటి విరుగుడు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. 

 

 

 ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ భారీ  నుంచి తప్పించుకునేందుకు క్రికెటర్లు కూడా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ నెలలో శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ బారినపడి అనారోగ్యం పాలు అవకుండా ఉండేందుకు వివిధ చిట్కాలు పాటిస్తున్నట్లు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్  తెలిపారు. ఇకనుంచి ఎవరితో మ్యాచ్ ఆడిన...  ప్రత్యర్థి ఆటగాళ్లతో షేక్ హాండ్స్  ఇవ్వము అంటూ తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బదులుగా తమ మెడికల్ టీం చెప్పిన చిట్కాలను పాటిస్తే అని తెలిపారు.

 

 

 ఆటగాళ్లు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా... దానికి బదులుగా ఫస్ట్ బంప్స్ (పిడికిలితో పలకరింత) ను ఇస్తామని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్  చెప్పుకొచ్చారు. ఇటీవలే జరిగిన దక్షిణాఫ్రికా టూర్ లో తమ ఆటగాళ్లందరూ గ్యాస్ట్రో ఎంటరైటిస్   ఫ్లూ తదితర అనారోగ్య సమస్యలకు గురయ్యామని కానీ ఇకనుంచీ చాలా జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. తమ ఆటగాళ్లు  ఎవరు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు... అటు జట్టు యాజమాన్యం కూడా ఎన్నో ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తులను తమకు అందజేసింది అంటూ చెప్పుకొచ్చారు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో  రూట్.

మరింత సమాచారం తెలుసుకోండి: