ప్రస్తతం జరుగుతున్న రంజీ ట్రోఫీ లో సౌరాష్ట్ర కెప్టెన్ కమ్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన రంజీ మొదటి సెమిస్ లో రెండో ఇన్నింగ్స్ లో గుజరాత్ పై 7వికెట్లు తీయడం తో ఉనద్కట్ 2019-20 సీజన్ లో ఇప్పటివరకు 9మ్యాచ్ ల్లో 65 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా  రంజీల్లో ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన మొదటి పేస్ బౌలర్ గా ఉనద్కట్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు  కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్ పేరిట ఉండేది. 1998-99 సీజన్ లో అతను 62వికెట్లు తీసుకున్నాడు. తాజాగా ఆ రికార్డు ను ఉనద్కట్ బ్రేక్ చేశాడు. 

 
ఇక ఉనద్కట్ అద్భుతమైన స్పెల్ తో సౌరాష్ట్ర సెమిస్ లో గెలిచి రంజీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈమ్యాచ్ లో మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 304 పరుగులకు ఆల్ అవుట్ కాగా గుజరాత్ 252 పరుగులు చేసింది.ఆతరువాత  రెండో ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర 274పరుగులకు అల్ ఔటై గుజరాత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 234పరుగులకే గుజరాత్ కుప్పకూలడం తో  సౌరాష్ట్ర 92పరుగుల తేడాతో  విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 139పరుగులు చేసి జట్టు కు భారీ ఆధిక్యాన్ని అందించిన వసవాడ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈనెల 9నుండి రాజ్ కోట్ వేదికగా జరిగే రంజీ ఫైనల్ లో బెంగాల్ ,సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: