మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ జోషి ని చీఫ్ సెలక్టర్ గా ఎంపిక చేసింది ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ). ఈ విషయాన్నిబీసీసీఐ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. సంజయ్ జోషి తోపాటు మాజీ ఆటగాడు హర్విందర్ సింగ్  సెలక్షన్ కమిటీ ప్యానెల్ సబ్యుడిగా ఎంపికయ్యాడు. వీరిద్దరూ ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ గా వున్న ఏంఎస్కె ప్రసాద్ అలాగే సెలక్టర్ గగన్ ఖోడా స్థానాలను భర్తీ చేయనున్నారు.  గత ఏడాదే ఏంఎస్కె ప్రసాద్ , గగన్ ఖోడా పదవి కాలాలు ముగిశాయి కానీ ఎంపిక పక్రియ ఆలస్యం  అవుతూ వచ్చింది. ఇక ఈరోజు షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ లు చేసి వారిలో అర్హులను ఎంపిక చేసింది సీఏసీ. కాగా సంజయ్ జోషి ఇండియా తరుపున 15టెస్టులు,69 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 
 
ఇదిలావుంటే చీఫ్ సెలక్టర్ పదివికి వెటరన్ బౌలర్ అజిత్ అగార్కర్ , శివ రామకృష్ణన్ కూడా దరఖాస్తు చేసుకున్నారు కానీ వారికి నిరాశేఎదురైంది. ఇక చీఫ్ సెలెక్టర్ సంజయ్ జోషి నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ  శుక్రవారం సౌతాఫ్రికా తో జరుగనున్న మూడు వన్డే ల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయనుంది. మార్చి 12న ధర్మశాల వేదికగా ఇరుజట్ల మధ్య మొదటి వన్డే జరుగనుండగా ఆతరువాత 15, 18న మిగితా రెండు వన్డేలు జరుగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: