మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మన దేశ ప్రేక్షకులే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ధోనిని అభిమానిస్తూ ఉంటారు. ధోని  ఆటకు అభిమాని అవ్వని వారు  కూడా ఉండరు. ఇక ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక దిగ్గజ కెప్టెన్ గా  తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఎప్పుడూ మైదానంలో కూల్ గా కనిపిస్తూ... పదునైన వ్యూహాలతో... భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించి  తనదైన ముద్ర వేసుకున్నాడు. ధోని ఆటే  కాదు ధోని ఆటిట్యూడ్ కి  కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే ముఖ్యంగా చెన్నై లో ధోని కి అందరూ వీరాభిమానులే  అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచి మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ సక్సెస్ సాధించాడు. 

 

 

 ఇప్పటివరకు ఏ జట్టు కి సాధ్యం కానీ మూడు ఐపీఎల్ ట్రోఫీలు... ఆరు సార్లు రన్నరప్ లుగా  నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇక క్రికెట్ అభిమానులకి ధోనీ ఒక దేవుడు అనే చెప్పాలి. అందుకే ఏకంగా సెక్యూరిటీని దాటుకొని వచ్చి మరీ ధోనిని కలవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక మైదానంలోకి దూసుకొచ్చిన అభిమానులను కూడా ధోనీ ఆటపట్టిస్తూ పరుగులు పెడుతూ ఉంటాడు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ గా ఉన్నా  ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కి  కూడా ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ కూడా ఎన్నో సార్లు చెప్పాడు. 

 

 

 అయితే ప్రస్తుతం ధోనికి ఎన్నో నిక్ నేమ్స్  పెట్టుకుని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మహి, ఎం ఎస్ ధోని, ఎంఎస్, మిస్టర్ కూల్ ఇలా చాలా పేర్లే ధోని అభిమానులు పిలుచుకునే జాబితాలో ఉన్నాయి. ఇక తాజాగా ఈ పేర్లలో మరో పేరు వచ్చి చేరింది. సిఎస్కే అభిమానులందరూ ప్రస్తుతం ధోని తాలా అని ముద్దుగా పిలుచుకుంటారు. తాలా అంటే తమిళంలో అర్థం నాయకుడు అని. ఇక ఈ పేరు తనకు ఎంతో ప్రత్యేకమైనది అంటూ ధోని  కూడా పలుమార్లు తెలిపాడు. తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా తనను తాలా అని పిలుస్తారు అంటూ తెలిపాడు ధోని . నాకు ఉన్న అన్ని నిక్ నేమ్స్ లో తాలా అనే పేరే తనకు ఎంతో ప్రత్యేకం అంటూ ధోనీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: