ప్ర‌పంచ క‌ప్ టీ 20 క్రికెట్ టోర్న‌మెంట్లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరింది. ఎట్ట‌కేల‌కు క‌ప్ సాధించాల‌న్న భార‌త మ‌హిళా క్రికెట్ టీం క‌ల‌ను నెర‌వేర్చేందుకు వ‌రుణ దేవుడు మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. హర్మన్ ప్రీత్ అండ్ గ్యాంగ్ కు వ‌రుణ దేవుడు ఆశీస్సులు ఉండ‌డంతో భార‌త్‌కు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. ఈ పొట్టి మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్లో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు సెమీఫైన‌ల్‌కు చేరినా ఈ గండం ఒక్క‌సారి కూడా అధిగ‌మించ లేక‌పోయింది. అయితే ఈ రోజు మ్యాచ్ ఆడ‌కుండానే వ‌రుణ దేవుడి ద‌య‌తో భార‌త్ ఫైన‌ల్‌కు వెళ్లింది.



వాస్త‌వంగా ఈ రోజు ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీస్ మ్యాచ్ జ‌రిగి ఉంటే ట‌ఫ్ పైట్ న‌డుస్తుంద‌ని అంద‌రూ భావించారు. అయితే  సిడ్నీలో వర్షం నిరంతరంగా కురుస్తుండడంతో అంపైర్లు మ్యాచ్‌ని క్యాన్సిల్ చేస్తూ తొలి సెమీస్ విజేతగా భారత్ అని ప్రకటించారు. గత టోర్నీ సెమీస్‌లో ఇండియాని ఇంటిబాట పట్టించిన ఇంగ్లండ్‌కి ఈ సారి నిరాశే ఎదురైంది. ఇక గ్రూప్ ద‌శ‌లో భార‌త్ అన్ని మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్ల‌తో ఉండ‌గా.. ఇంగ్లండ్‌కు కేవ‌లం 6 పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి.



ఇప్పుడు సెమీఫైన‌ల్ ర‌ద్ద‌వ్వ‌డంతో గ్రూప్ ద‌శ‌లో అగ్ర‌స్థానంలో ఉన్న భార‌త్‌ను విజేత‌గా నిర్ణ‌యించి ఫైన‌ల్‌కు పంపారు. ఇక మ‌ధ్యాహ్నం జ‌రిగే రెండో సెమీస్‌కు కూడా వ‌రుణుడి గండం పొంచి ఉంది. దక్షిణాఫ్రికా (7), ఆస్ట్రేలియా(6)లలో సౌతాఫ్రికాకే ఎక్కువ పాయింట్స్ ఉన్న క్రమంలో సౌతాఫ్రికా నేరుగా ఫైనల్స్‌కి చేరుతుంది. ఈ క్రమంలో మార్చి 8న జరగనున్న ఫైనల్‌లో భారత్‌, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: