మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ లో కెప్టెన్ గానే కాకుండా సగటు ఆటగాడిగా కూడా ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గత ప్రపంచ కప్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి ధోని క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో  టీమ్ ఇండియా  ఎన్నో మ్యాచ్ లు  ఆడినప్పటికీ ధోని  మాత్రం అందుబాటులో లేడు. ఇక దాదాపు ఎనిమిది నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఎనిమిది నెలల పాటు క్రికెట్ కు  దూరంగా ఉంటున్న కూడా ధోని  క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని మరోసారి నిరూపితమైంది. మామూలుగానే టీమిండియా జట్టు లోని ఆటగాళ్లందరిలో  ధోని కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక క్రికెట్ కి దూరంగా ఉన్న ఆ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 

 

 

 ఐపీఎల్ 20 సీజన్ కోసం ధోని మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని ని చూసేందుకు ఎంతో మంది అభిమానులు చెన్నైకి చేరుకున్నారు. చెపాక్ స్టేడియం కి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. కేవలం తరలి రావడం కాదు ఇక్కడ ఒక అభిమాని అయితే ఏకంగా సెక్యూరిటీని బారికేడ్లను దాటుకుని సాహసోపేతంగా స్టేడియంలోకి వచ్చేసాడు. మైదానంలో ఉన్న ధోనిని  కలవడానికి సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకొని వచ్చాడు. ఈ సందర్భంగా ధోని మైదానంలోకి వచ్చిన అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 

 


 అయితే మార్చి 29వ తేదీన ఐపిఎల్ టి20 మ్యాచ్ లు ప్రారంభం కానుండగా... తొలి మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్ జట్లు తలపడనున్నాయి . ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుండి చేపాక్ స్టేడియంలో ఆటగాళ్ళందరూ ప్రాక్టీస్ లో మునిగిపోయారు. ప్రాక్టీస్ కు  ముందు ధోని వామప్ చేస్తూ పరుగు తీస్తున్న సమయంలో... అభిమాని  మైదానంలోకి దూసుకొచ్చాడు... అభిమాని ని చూసిన ధోని  పరుగు ఆపకుండా కాస్త వేగాన్ని తగ్గించి అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకి  పంపించారు. అంతేకాకుండా ఈ స్టేడియంలో ధోనీ ధోని   అంటూ అభిమానులు అందరూ హోరెత్తిపోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: