టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ను  రంజీ ఫైనల్ లో ఆడించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జై షా, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని రిక్వెస్ట్ చేశాడు. అయితే గంగూలీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మొదట దేశం ముఖ్యం.. ఈనెల 12నుండి సౌతాఫ్రికా తో భారత్ మూడు వన్డే ల సిరీస్ ప్రారంభం కానున్ననేపథ్యం లో సిరీస్ కు ముందు జడేజా ను రిలీజ్ చేయలేమని గంగూలీ స్పష్టం చేసాడట. దాంతో మార్చి 9నుండి రాజ్ కోట్ వేదికగా జరుగనున్న 2019-20 సీజన్ రంజీ ఫైనల్ మ్యాచ్ కు జడేజా అందుబాటులో ఉండడం లేదు. 
 
బెంగాల్ ,సౌరాష్ట్ర జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుండగా  సౌరాష్ట్ర తరుపున టెస్టు స్పెషలిస్ట్ పుజారా ,బెంగాల్ తరుపున సాహా బరిలోకి దిగనున్నారు. ఇక సౌతాఫ్రికా తో సిరీస్ కారణంగా ఫాస్ట్ బౌలర్ షమి కూడా తన సొంత జట్టు బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించడంలేదు. ఇదిలాఉంటే చీఫ్ సెలక్టర్ సంజయ్ షా నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఈరోజు లేదా రేపు  సౌతాఫ్రికా తో జరిగే మూడు వన్డే ల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇటీవల గాయాల కారణంగా పలు సిరీస్ లకు దూరమైన శిఖర్ ధావన్ ,హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ఈ సిరీస్ కు అందుబాటులో వుండే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: