ప్రపంచంలో క్రికెట్ అంటే చిన్నా పెద్ద... ఆడా మగా అనే తేడా లేకుండా ఎవ్వరైనా ఇష్టపడతారు.. మరికొంత మంది పిచ్చెక్కిపోతారు.  క్రికెట్ అంటే ఒకప్పుడు కొన్ని దేశాల వారికి మాత్రమే.. కానీ ఇప్పుడు గల్లీ గల్లీకి క్రికెట్ అన్న చందంగా తయారైంది.  సెలవులు వస్తే చాలు పిల్లలు గల్లీల్లో క్రికెట్ తో సందడి చేస్తుంటారు.  ఇక పెద్దలు కూడా మైదానాల్లో తమ జోరు కొనసాగిస్తుంటారు.  భారత్ లో క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ ని కొలుస్తారు.  చిన్నతనంలోనే  క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టి ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించిన దిగ్గజం.. ఆయన తర్వాత ఎం ఎస్ ధోని.. ఈయన బ్యాటింగ్ హెలికాఫ్టర్ స్టైల్ అంటారు.  బ్యాట్ పట్టాడు అంటే సిక్స్ లు.. ఫోర్లు అన్నట్టే.  అందుకే ఆయన చాలా కాలం పాటు టీమ్ కెప్టెన్ గా కొనసాగారు. 

 

ఇక క్రికెట్ లో ఇప్పుడు విరాట్ కోహ్లీ రాజ్యమేలుతున్నాడు.. ఈయన కూడా మైదానంలోకి అడుగు పెడితే.. మినమం హాఫ్ సెంచరీ లేదా సెంచరీ అన్న రీతిలో కొనసాగుతుంది.  అయితే క్రికెట్ లో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.  సోషల్ మీడియా పుణ్యమా అని ఆ వింతలు చూస్తూ ఆడియన్స్ తెగ సంబరపడిపోతుంటారు. సాధారణంగా క్రికెట్ లో స్ట్రయిట్ డ్రైవ్, బ్యాక్ డ్రైవ్, హెలికాప్టర్ షాట్... ఇవన్నీ అందరికీ తెలిసినవే.  కానీ ఓ యువకుడు వెరైటీ కొట్టుడు కొట్టి క్రికెట్ రంగంలోనే ఓ చరిత్ర సృష్టించాడు. షాట్ ను మాత్రం మీరు ఎప్పుడూ చూసి వుండరు.

 

తన కాళ్ల మధ్యగా వస్తున్న బాల్ ను, అలాగే రెండు కాళ్ల మధ్య నుంచి వెనక్కు లేపి, బౌండరీ వైపు పంపాడో యువకుడు.  ఇది యాధృచ్చికంగా జరిగినప్పటికీ.. ఈ షార్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందని.. ఇలా కొడితే ఖచ్చితంగా ఫోర్ గ్యారెంటీ అంటున్నారు క్రికెట్ అభిమానులు. ఎక్కడ ఈ మ్యాచ్ జరిగిందో తెలియదుగానీ, సోషల్ మీడియాలో ఈ షాట్ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఓ కొత్త షాట్ ను ఈ యువకుడు కనిపెట్టాడని నెటిజన్లు కితాబిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: