భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ అంటే ఇష్టం అనేదానికంటే క్రికెట్ అంటే పిచ్చి అనడంలో కూడా అతిశయోక్తి లేదు. అంతలా భారతీయులను క్రికెట్ ప్రభావితం చేస్తుంది. ఇక మామూలుగానే క్రికెట్ కి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ వుంటుంది ఇండియాలో. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చింది అంటే అబ్బో ఆ సందడి మామూలుగా ఉండదు. క్రికెట్ ఎంజాయ్మెంట్ కాస్త డబుల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకూ 11మంది ఆటగాళ్లు దేశం కోసం ప్రత్యర్థి జట్ల అన్నింటిని ఓడిస్తూ క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ ఐపీఎల్ వచ్చిందంటే సొంత జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థులుగా మారిపోయి... వాళ్లకి విదేశీ ఆటగాళ్లతో జత చేసుకొని.. తోటి ఆటగాళ్ళతోనే హోరా హోరీగా మైదానంలో పోరాడుతూ ఉంటారు. అందుకే ఐపీఎల్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు. 

 

 

 కాగా ఈ ఏడు ఐపీఎల్ మ్యాచ్ మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతదేశంలో  కరోనా  వైరస్ విజృంభిస్తోంది. దీంతో అందరూ ఇళ్ల నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది అంటూ అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా కాస్త నిరాశ చెందారు. కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు ఐపీఎల్ మ్యాచ్లు సక్రమంగా జరుగుతాయ ఒకవేళ జరిగినా మైదానాలకు క్రికెట్ ప్రేక్షకులు వెళ్లి చూస్తారా అని అనుమానం ఉండేది. 

 

 

 అయితే దేశంలో కరోనా  ప్రభావం ఉన్నప్పటికీ యధాతధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఐపీఎల్ టోర్నీ సాగేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నామని గంగూలీ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచ్ లు  జరుగుతున్నాయని తెలిపిన బిసిసిఐ అధ్యక్షుడు గంగూలి... ఐపీఎల్ మ్యాచ్ లకు కూడా ఎలాంటి అంతరాయం లేదు అంటూ స్పష్టం చేశారు. ఆటగాల్లు  ఎవరు ప్రేక్షకులతో కరచాలనం చేయొద్దని సెల్ఫీ లకు ఫోటో లకు దూరంగా ఉండాలని సూచించారూ. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నిండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: