త్వరలో జరుగనున్న ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ తన ఫ్రాంచైజీకి తెలియజేశాడు. రానున్న టెస్టు మ్యాచ్ లకు సన్నద్ధం కావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వోక్స్ వెల్లడించాడు. ఇటీవల జరిగిన వేలం లో ఈ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. వోక్స్ తీసుకున్నఈ నిర్ణయంతో ఢిల్లీ యాజమాన్యం ఖంగుతింది.
 
అయితే ఐపీఎల్ లో వోక్స్  ప్రదర్శన ఏమంత గొప్పగా  లేదు కానీ ఇప్పటికే ఢిల్లీ బౌలర్లు రబాడ, ఇశాంత్ శర్మ  గాయాల బారిన పడ్డారు వీరు ఎప్పటికి కోలుకుంటారో స్పష్టత లేదు ఇక ఉన్న ఒక్క అనుభవజ్ఞ బౌలర్ వోక్స్ కూడా దూరం కావడం తో ఢిల్లీ కి దెబ్బ పడింది. మరి వోక్స్ స్థానం లో ఢిల్లీ ఎవరిని తీసుకుంటుందో చూడాలి.  ఇదిలావుంటే ఈనెల 29నుండి ఐపీఎల్ 13వ సీజన్ సార్ట్ కానుండగా మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. 
 
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : 
 
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శిఖర్ ధావన్ , రిషబ్ పంత్ , డికాక్ , రహానే , అశ్విన్ ,హెట్మెయర్,అలెక్స్ కేరీ, జాసన్ రాయ్, మోహిత్ శర్మ ,పృథ్వీ షా, లలిత్ యాదవ్, అవేశ్ ఖాన్, అక్సర్ పటేల్, తుషార్ దేశ్ పాండే, హర్షల్ పటేల్ , కీమో పాల్, అమిత్ మిశ్రా, రబాడ, మార్కస్ స్టోయినిస్, సందీప్ లమిచ్చానే, ఇషాంత్ శర్మ 

మరింత సమాచారం తెలుసుకోండి: