స్వదేశం లో జింబాబ్వే  తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ 3-0తో వైట్ వాష్ చేసింది. అందులో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డే లో బంగ్లా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్ ను 43ఓవర్ల కు కుదించగా.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 3వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఓపెనర్లు  లిటన్ దాస్ (176), తమీమ్ ఇక్బాల్( 128*) సెంచరీలతో చెలరేగారు. ఈక్రమంలో బంగ్లా తరపున వన్డే చరిత్ర లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను సాధించిన బ్యాట్స్ మెన్ గా దాస్ రికార్డు సృష్టించాడు.
 
అనంతరం జింబాబ్వే టార్గెట్ ను 43 ఓవర్ల లో 342 పరుగులు గా నిర్ణయించగా..  భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన  జింబాబ్వే 37.3 ఓవర్ల లో 218 పరుగులకు ఆల్ ఔటై ఓటమిని చవిచూసింది.సెంచరీ హీరో లిటన్ దాస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా ఈసిరీస్ లో దాస్, తమీమ్ ఇక్బాల్ ఇద్దరు 300 కు పైగా పరుగులు చేయడంతో ఇద్దరికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఈమ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ మోర్తజా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. మరి బీసీబీ, వన్డే  సారథ్య బాధ్యతలను ఎవరికి కట్టబెడుతుందో చూడాలి. ఇక జింబాబ్వే, బంగ్లాదేశ్ లమధ్య ఈనెల 9నుండి రెండు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: