ప్రస్తుతం అందరి చూపు ఈరోజు జరగబోయే ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ పైనల్ మ్యాచ్ పైనే  ఉంది. ఇప్పుడు వరకు అన్ని జట్లను  ఓడిస్తూ సెమీ ఫైనల్ కు చేరుకున్న భారత జట్టుకు... వరుణుడు కరుణించడం తో ఎలాంటి పోటీ పడకుండానే ఫైనల్ కు వెళ్లే అవకాశం దక్కింది. అయితే భారత మహిళల జట్టు మొదటిసారి ప్రపంచ కప్ ఫైనల్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ చూపు ఈ తుది సమరం పైన ఉంది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ కు  ఆస్ట్రేలియా ఆతిథ్యం అందిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది భారత్. 

 


 అయితే తన 31 వ పుట్టినరోజు నాడే కెరీర్ లోనే పెద్ద మ్యాచ్ ను  ఇప్పటి వరకూ భారత మహిళల జట్టు ఆడని  మ్యాచ్ ను  టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆడనుంది. అటు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు కూడా...  అభిమానుల సపోర్టుతో స్థాయికి తగ్గ  ప్రదర్శన చేసి కప్పు గెలవాలంక  అనుకుంటుంది. అయితే ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కు మరో మధురానుభూతిని మిగిల్చనుంది . హర్మన్ ప్రీత్  సారథ్యంలో భారత మహిళల జట్టు మొదటిసారి ఐసీసీ టీ 20 ప్రపంచకప్ లో  ఆడుతున్న నేపథ్యంలో హర్మన్ ప్రీత్ తల్లిదండ్రులు ఇప్పటికే భారత్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. 

 


 అంతకు ముందు జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ కాస్త వర్షం  కారణంగా రద్దు కావడంతో... హర్మన్ ప్రీత్ ఆట ను చూసే అవకాశం దక్కలేదు తల్లిదండ్రులకు. ఇక ప్రస్తుతం ఏకంగా ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో  హర్మన్ ప్రీత్  తల్లిదండ్రుల కోరిక తీరనున్నట్టు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రుల సమక్షంలో మహిళల దినోత్సవం రోజు... హర్మన్ ప్రీత్ సింగ్ ప్రపంచ కప్ టైటిల్ ని అందుకోవాలని బలంగా కోరుకుంటోంది. ఓవైపు మొదటిసారి టైటిల్ గెలవాలని భారత జట్టు బాధిస్తుంటే ఐదవసారి అభిమానుల సమక్షంలో టైటిల్ గెలవాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. అయితే భారత్ ఓపెనర్లు షెహలి  వర్మ,  స్మృతి మందాన లు ఫైనల్లో చెలరేగితే ఆసీస్ జట్టు తలవంచక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ ఫైనల్లో భారత్ టైటిల్ పోరులో విజయం సాధిస్తుందా లేదా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: