నేడు జరుగుతున్న ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా ఈరోజు జరుగుతున్న మహిళల టీ - 20 వరల్డ్‌ కప్ ఫైనల్లో భారత్ జట్టు మొదటగా ఫీల్డింగ్ చేయవలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీం కెప్టెన్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకోగా, మహిళా క్రికెట్‌ చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు ఫైనల్కి ప్రవేశించింది. ఇప్పటి వరకూ మొత్తం ఆరు సార్లు టీ - 20 ప్రపంచకప్ నిర్వహించగా అందులో ఏకంగా ప్రతిసారి ఆస్ట్రేలియా టీం ఫైనల్‌కి చేరడం వారి ఆధిపత్యానికి అది నిదర్శనం. ఇది ఇలా ఉండగా లీగ్ దశలో ఒకసారి ఆస్ట్రేలియాని భారత్ ఆసీస్ ని ఓడించడం గొప్పగా చెప్పుకొనే అంశం. 

 

IHG


ఈ ప్రపంచ కప్ టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాని 17 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన, ఆ తర్వాత జరిగిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్ శ్రీలంక జట్లని చిత్తుచేసి అజేయంగా లీగ్ దశని ముగిస్తూ సెమీస్‌ కి భారత్ చేరింది. ఇది ఇలాఉండగా ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా జరగపోవడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ జట్టు ఫైనల్‌ కి సులువుగా అర్హత సాధించింది.

 

 


ప్రస్తుతం భారత్ జట్టులో ఓపెనర్ షెఫాలి వర్మ సూపర్ ఫామ్‌ లో ఉండగా, మరో ఓపెనర్ మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమ మార్క్ ఇన్నింగ్స్ ఇంకా ఆడలేదు. అయితే కీలకమైన ఫైనల్లో ఈ ఇద్దరూ ఫామ్ లోకి వస్తే భారత్‌కి తిరుగుండదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: