మెల్ బోర్న్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్ టీ - 20 ఫైనల్ లో భారత్ ఏకంగా 85 పరుగులతో ఓడిపోవడానికి నిజానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా భారత్ మహిళలు ఫీల్డింగ్ లో ఎన్ని తప్పిదాలు చేసారో లెక్క వేసుకుంటే చేతి వేళ్ళు సరిపోవు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి మరి. మరి ముఖ్యంగా మ్యాచ్ లో రెచ్చిపోయిన  హెలి ఇచ్చిన క్యాచ్ ని భారత ప్లేయర్ షఫాలీ వర్మ నెలపాలు చేసింది. దీనితో రెచ్చి పోయిన హెలి మ్యాచ్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొంది. దానితో బౌలర్ ఎవరని లెక్కచేయకుండా బంతి వేస్తే పరుగుల పిండుకోవడం చేసింది.

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ICC T20' target='_blank' title='t20-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>t20</a> FINAL PHOTOS

 

హేలీకి తోడుగా మరో ఓపెనర్ మూనే తాను చివరి వరకు నిలబడి 78 పరుగులతో అజేయంగా పట్టింది. ముఖ్యం వీరిద్దరు కలిసి మొదటి వికెట్ కి 115 పరుగుల జోడించడంతో ఆస్ట్రేలియాకి అదిరిపోయే ఆరంభం లభించింది. 115 పరుగుల వద్ద వికెట్ పడిన తర్వాత కాస్త మళ్ళీ 2 వికెట్లు కోల్పోవడంతో కాస్త స్కోర్ బోర్డు నెమ్మదించింది. కానీ మూనే అనూహ్యంగా పుంజుకొని చెలరేగి ఆడింది. ముఖ్యం గా భారత బౌలర్లు వికెట్లు తీయడానికి, అలాగే పరుగుల కట్టడి చేయడానికి ఎంత కృషి చేసిన అది ఏ మాత్రం వారికీ సరిపోలేదు. దీనితో ఏకంగా ఆస్ట్రేలియా 184 పరుగులు చేసింది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ICC T20' target='_blank' title='t20-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>t20</a> FINAL PHOTOS

 

ఆ తర్వాత ఇన్నింగ్స్ ని ఆరంభించిన భారత బ్యాట్స్ ఉమెన్స్ మొదటి ఓవర్ లోనే హిట్టర్ షఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. ఇక అక్కడి నుండి వికెట్లు తీయడం ఆస్ట్రేలియా టీం వాళ్ళకి పరిపాటిగా మారింది. అది ఎంతలా అంటే కేవలం 30 పరుగులకే 4 ప్రధాన బ్యాట్స్ ఉమెన్స్ అవుట్ అయ్యారనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి టార్గెట్ ని అందుకోవడం లో భారత ప్లేయర్లు పూర్తిగా బోర్లా పడ్డారు. దీనితో ప్రపంచకప్ ఐదోసారి గెలవం ఆస్ట్రేలియా వంతు అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: