టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రీ - ఎంట్రీపై భారత్ కొత్త సెలక్షన్ కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది. గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకి  దూరంగా ఉంటున్న ధోనీ, అక్టోబర్ నెలలో జరిగే టీ - 20 ప్రపంచకప్‌ రేసులో నిలవాలంటే ఐపీఎల్ - 2020 సీజన్‌ లో తన ఫామ్ ని నిరూపించుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసింది. 

IHG

 

దీనితో మార్చి 29 నుంచి జరిగే ఐపీఎల్ - 2020 సీజన్ మ్యాచ్‌ లు మొదలు అవుతుండగా, కొన్ని రోజుల కిందనే చెన్నైకి చేరుకున్న ధోనీ చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అందరికి తెలిసిన విషయమే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం కొన్ని రోజుల క్రితం ముగియగా, కర్ణాటకకి చెందిన సునీల్ జోషి చీఫ్ సెలక్టర్‌ గా గత వారం ఎంపికైన విషయం తెలిసిన విషయమే. ఆయన ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన జోషి, దక్షిణాఫ్రికా సిరీస్ తో ఈనెల 12 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌ కి జట్టుని కూడా ఆదివారం విడుదల చేసింది. కాకపోతే అందులో ధోనీ పేరుని మాత్రం టీమ్ సెలక్షన్ సమయంలో సెలక్టర్లు ఎక్కడ ప్రస్తావించలేదు. 

IHG

 


దీనితో ధోని భవితవ్యం గురించి కూడా ఎలాంటి చర్చ మీటింగ్‌ లో రాలేదు. ఐపీఎల్ - 2020 సీజన్‌ లో నిలకడగా ఆడితేనే టీమిండియాలోకి మళ్లీ ధోనీ రీఎంట్రీ వస్తాడు. దీనికి కారణం అతనితో పాటు చాలా మంది క్రికెటర్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఐపీఎల్‌ లో ధోనీ కంటే ఎవరైనా మెరుగ్గా  ఆడితే అప్పుడు వారినే తీసుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు చూడాలి దీనిపై ధోని ఇందుకు ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: