పాకిస్థాన్ లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నిజానికి ఫన్నీ సన్నివేశాలకి ఒక వేదికగా మారిపోతోంది. ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి అయోమయ  రనౌట్లు, కామెడీ తరహాలో క్యాచ్‌ లు విడిచి పెట్టడాలు, బ్యాట్స్‌మెన్ తల నుంచి పొగలు రావడం ఇలా ఒకటేమిటి రోజు ఏదో ఒక విధంగా పీఎస్‌ఎల్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. 

 


అయితే ఈ సిరీస్ లో తాజాగా లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ లో వికెట్ కీపర్ వాల్టన్ ఓ సులువైన క్యాచ్‌ ని వదలేయతె కాకుండా ఆ వెంటనే బ్యాట్స్‌మెన్ కాళ్లు పట్టుకున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ తన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 187 పరుగులు చేసింది. 

 

 

ఆ తర్వాత 189 పరుగుల లక్ష్యాన్ని లాహోర్ టీమ్ 19.1 ఓవర్లలోనే 190/2తో విజయాన్ని చేరుకొంది. వాస్తవానికి బెన్ డక్ 10వ ఓవర్‌ లోనే అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీడియం పేసర్ డెల్‌ఫోర్ట్ విసిరిన బంతిని రివర్స్ స్వీప్ ద్వారా బౌండరీకి తరలించేందుకు బ్యాటర్ డక్ ప్రయత్నించాడు. కానీ ఆ బాల్ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి అలానే గాల్లోకి లేచింది. దీనితో డక్ తలపై గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు వికెట్ కీపర్ వాల్టన్ అంతే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. 

 

 

కాకపోతే బంతి నేరుగా వచ్చి డక్ హెల్మెట్‌ పై పడి కిందకి పడుడుతుంటే దాన్ని అలానే పట్టుకోవాలని ఆశించిన వాల్టన్ మెకాళ్లపై కూర్చుని క్రీజులో ఉన్నడ క్‌ని గట్టిగా హత్తుకొని వాల్టన్, డక్ కాళ్లని గట్టిగా పట్టుకోవడంతో డక్ కూడా ఎక్కడికీ కదల్లేకపోయాడు. నిజానికి వాల్టన్ కీపర్ తొందరపడకుండా బంతి గమనాన్ని గమనించింటే సులువుగా క్యాచ్ దొరికేది. ఏది ఏమైతేకాని పీఎస్‌ఎల్ క్రికెట్ అభిమానులకి వినోదాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: