రెండు టీ 20 ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్, జింబాబ్వే ల మధ్య సోమవారం జరిగిన మొదటి టీ 20 లో ఆతిథ్య బంగ్లాదేశ్ 48 పరుగుల తేడా తో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్ల లో 3వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అయితే 10 ఓవర్ లో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. తమీమ్ (41) క్యాచ్ అవుట్ కాగా ఆతరువాత కాసేపటికే మరో ఓపెనర్ లిటన్ దాస్ (59) కూడా వెనుదిరిగాడు ఈదశలో క్రీజ్ లోకి వచ్చిన సౌమ్య సర్కార్  ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లో 5 సిక్సర్లు ,4 ఫోర్ల సాయంతో అతను 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మధ్య లో ముష్ఫికర్  రహీం అవుట్ కాగా కెప్టెన్ మహమ్మదుల్లా తో కలిసి సర్కార్ ,బంగ్లా కు భారీ స్కోర్ అందించాడు. 
 
అనంతరం లక్ష్య ఛేదన లో జింబాబ్వే 19 ఓవర్ల లో 152 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైయింది. బంగ్లా బౌలర్ల లో ముస్తాఫిజుర్ రెహ్మన్ 3, అమినుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా షఫీయుల్ ,సైఫుద్దీన్ ,అఫిఫ్ చెరో వికెట్ తీశారు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన సౌమ్య సర్కార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ బుధవారం జరుగనుంది. ఈమ్యాచ్ తో బంగ్లాదేశ్ లో జింబాబ్వే పర్యటన ముగియనుంది. ఈపర్యటనలో భాగంగా ఇప్పటికే జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: