టీమిండియా యువ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్  తన ఫేవరేట్ క్రికెటర్ అని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేర్కొన్నాడు. రాహుల్ ఆట చూడటాన్నిఎంత గానో ఇష్టపడతాను.. ప్రపంచంలోనే నా ఫేవరేట్ క్రికెటర్ అతనేనంటూ చెప్పుకొచ్చాడు లారా. ప్రస్తుతం జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో పాల్గొనడం కోసం ఇటీవల లారా ఇండియా వచ్చాడు అందులో భాగంగా  తాజాగా మీడియా తో మాట్లాడిన లారా ఈ వ్యాఖ్యలు చేశాడు.  కాగా రోడ్డు భద్రత పై అవగాహాన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సిరీస్ ను నిర్వహిస్తుంది. ఈ వరల్డ్ సిరీస్ లో లారా, వెస్టిండీస్ లెజెండ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా  ఈ సిరీస్లో  జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ చేతిలో ఓటమిపాలైయింది. 
 
ఇదిలావుంటే గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఏ స్థానం లోనైనా బ్యాటింగ్ చేస్తూ విశేషంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ధోని ,కోహ్లీ, రోహిత్ ల తర్వాత టీమిండియా ఆటగాళ్లలో  రాహుల్ కే క్రేజ్ ఎక్కువగా వుంది. ఇక మరో రెండు రోజుల్లో సౌతాఫ్రికా తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ లో కూడా తన సూపర్ ఫామ్ ను కొనసాగించాలని రాహుల్ పట్టుదలతో వున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: