ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత ధనిక బోర్డు బిసిసిఐ 2008లో తీసుకున్న సంచలన నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. నిర్ణయమే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ సంవత్సరానికి ఒకసారి వేసవిలో వచ్చి ప్రపంచంలోని క్రీడాభిమానులు అందరినీ ఉర్రూతలూగిస్తుంది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద క్రికెట్ లీగ్. వందలకొద్ది ప్లేయర్లు, లక్షలకొద్దీ అభిమానులు, కోట్ల కొలదీ రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ ఘనత అంతా ఇంతా కాదు. అయితే ఈసారి మాత్రం బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ అనుకున్న సమయానికి జరిగే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి.

 

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తన ప్రభావం చూపిస్తుండగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ సైతం వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే భారతదేశంలో నేటికీ నలభై ఐదు కరోనా కేసులు పాజిటివ్ గా ఉన్నట్లు తేలగా అందులో అధికశాతం ఇటాలియన్ టూరిస్టులు ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పరిస్థితిని పరిశీలించిన మీదట ఒక నిర్ణయం తీసుకుంటామని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.

 

అయితే అందరూ చెబుతున్న దాని ప్రకారం లీగ్ ప్రారంభం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయట. దాదాపు ముఖ్యమైన నగరాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున ఇంకా అక్కడే ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతుండగా.... ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే అంత మంది జనం లో కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అని ఇప్పటికే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే గంగూలీ మాత్రం వైద్య బృందంతో తాము కలిసి చర్చించి తర్వాత ఐపీఎల్ ఆరంభం పై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే మనదేశంలో కరోనా వల్ల ఎవరు చనిపోలేదు కానీ బీసీసీఐ పరిస్థితుల్లో ఐపీఎల్ ఆరంభించి ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా అన్నది అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: