భారత పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు తో మూడు వన్డే ల సిరీస్ లో తలపడేందుకు సౌతాఫ్రికా నిన్న భారత్ లో అడుగుపెట్టింది. దుబాయి మీదుగా ఢిల్లీ కి చేరుకున్న ప్రొటీస్ జట్టు కొద్దీ సేపటి క్రితం మొదటి వన్డే జరుగనున్న ధర్మశాలకు బయలుదేరింది. గురవారం ఇరు జట్ల మధ్య మొదటి వన్డే(డే/నైట్) జరుగనుంది. ఇక గత ఏడాది భారత్ పర్యటనకు వచ్చి టీ 20 ,టెస్టు సిరీస్ లలో తలపడ్డ సౌతాఫ్రికా.. టీ 20 సిరీస్ ను డ్రా చేసుకోగా టెస్టు సిరీస్ లో వైట్ వాష్ కు గురైంది. అయితే ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ప్రస్తుతం జోష్ మీదున్న సౌతాఫ్రికా, భారత్ పై కూడా అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో వుంది. 
 
ఇక న్యూజిలాండ్ తో జరిగిన వన్డే, టెస్టు సిరీస్ లో అవమానకర రీతిలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కున్న టీమిండియా, సౌతాఫ్రికా తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి మళ్ళీ గాడిలో పడాలని భావిస్తుంది. ఇదిలావుంటే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండడం అలాగే  భారత్ లోకూడా కరోనా కేసుల నమోదు కావడం తో ఈ వన్డే సిరీస్ కు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. అందులో భాగంగా ఆటగాళ్లు కరచాలనం చేయకూడదని సౌతాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ తమ ఆటగాళ్లకు సూచించాడు. ఇక మూడు మ్యాచ్ లు..  ధర్మశాల, లక్నో ,కోల్ కతా లో జరుగనుండగా ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో  ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం తో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: