టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్ తో చెలరేగడం తో ఈమ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక లెజెండ్స్ నిర్ణీత 20ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 138పరుగులు మాత్రమే చేసింది. ఇండియా లెజెండ్స్ బౌలర్ల లో మునాఫ్ పటేల్ 4ఓవర్ల లో 19 పరుగులు మాత్రమేఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా లెజెండ్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ మూడో బంతికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ డకౌట్ కాగా ఆతరువాత కాసేపటికే మరో ఓపెనర్ సెహ్వాగ్ అవుట్ అయ్యాడు. ఇక యువరాజ్ కూడా ఇలా వచ్చి అలా  పెవిలియన్ కు చేరడం తో 19పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కైఫ్ ,సంజయ్ బంగర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే 62 పరుగుల వద్ద బంగర్ అవుట్ అవ్వడం తో వీరి భాగస్వామ్యానికి తెర పడింది.
 
ఆతరువాత ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి కైఫ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కైఫ్ నెమ్మదిగా ఆడగా పఠాన్ మాత్రం ఫోర్లు, సిక్సర్ల తో రెచ్చిపోయాడు. చివర్లో కైఫ్ (45) వెనుదిరిగిన గోని తో కలిసి పఠాన్ 18.4 ఓవర్ల లోనే మ్యాచ్ ను ముగించేశాడు. 31బంతుల్లో 6ఫోర్లు ,3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసిన ఇర్ఫాన్ పఠాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఈ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ కు వరుసగా ఇది రెండో విజయం ఇంతకుముందు మొదటి మ్యాచ్ లో విండీస్ లెజెండ్స్ పై విజయం సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: