టీం ఇండియాలో జస్ప్రిత్ బూమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టులోకి అడుగు పెట్టిన కొన్ని రోజులకే బూమ్రా కీలక ఆటగాడిగా ఎదిగాడు. బౌలింగ్ కి నాయకత్వం వహిస్తున్నాడు బూమ్రా. జట్టులో ఎంత మంది ఉన్నా సరే బూమ్రా ప్రాధాన్యత వేరు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా అతని సొంతం. జట్టు తక్కువ పరుగులు చేసినా సరే బూమ్రా ఉంటే చాలు కట్టడి చేస్తాడు అనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. 

 

అయితే విదేశీ పర్యటనలలో అతను తెలిపోతున్నాడు. అతని ఖాతాలో ఒకప్పుడు పడిన వికెట్లు ఇప్పుడు పడటం లేదు. న్యూజిలాండ్ సీరీస్ లో అతను సాధారణ బౌలర్ అయ్యాడు గాని అంతగా ప్రభావం చూపించే ప్రదర్శన అంటూ చేయలేకపోయాడు. దీనితో అతన్ని జట్టు నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కెప్టెన్ కోహ్లీ అనే డిమాండ్లు వినపడుతున్నాయి. ప్రస్తుతం జట్టులో అతని పాత్ర చాలా కీలకం. 

 

మరి అతన్ని తప్పిస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న వినపడుతుంది. యువ బౌలర్లు ఉన్నారని అతని వైవిధ్యం ఇప్పుడు పనికిరావడం లేదని, కాబట్టి అతన్ని జట్టు నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టి20 ప్రపంచకప్ వస్తుంది కాబట్టి ఈ ప్రపంచకప్ లో బౌలింగ్ విభాగం బలంగా ఉండాలి. మరి బూమ్రా విషయంలో కోహ్లీ ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: