గత నెలలో న్యూజిలాండ్‌ పర్యటన భాగంగా వన్డే, టెస్టు సిరీస్‌ లలో వైట్‌ వాష్‌ కు గురైన భారత జట్టు నేటి నుంచి మరో పోరుకు సిద్ధమైంది. కాకపోతే ఇప్పుడు వేదిక సొంతగడ్డ భారత్ కు మారింది. పోయిన సంవత్సరం అక్టోబరులో భారత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా, ఆ పర్యటనకు కొనసాగింపుగా ఇప్పుడు వన్డే సిరీస్ ను భారత్ లోనే ఆడనుంది. 

 

 


ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు వరుసగా 5 అంతర్జాతీయ మ్యాచ్‌ లలో ఓటముల తర్వాత విజయాన్ని అందుకోవాలని భారత్‌ ప్రయత్నిస్తుండగా డికాక్‌ నేతృత్వంలో విజయం సాధించాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ధర్మశాలలో కురుస్తున్న వర్షాల కారణంగా తొలి వన్డే మ్యాచ్‌ జరుగుతుందో లేదో అనుమానమే. 

 

 

 

గత రెండు రోజుల నుంచి ధర్మశాలలో ఎడతెరపి లేకుండా వర్షం ధర్మశాలలో కురుస్తోంది. ఇక బుధవారం ఉదయం కాస్త విశ్రాంతి ఇచ్చిన వరుణుడు, అక్కడ భారత జట్టు సాధన ముగియగానే మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. అక్కడ కుండపోతగా వాన కురుస్తుండటంతో సిబ్బంది పూర్తి మైదానాన్ని కవర్లతో కప్పేశారు. అయితే నేడు కూడా 90 శాతం వరకు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నుంచి సమాచారం తెలుస్తోంది. దీంతో మ్యాచ్‌ జరగడం అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: