భారతదేశంలో చాలామందికి ఇష్టమైన ఆట అంటే టక్కున చెప్పేది క్రికెట్ అని. అందులో ఐపీఎల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ అంటే క్రికెట్ కి పండుగా వచ్చినట్టు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ సీజన్ ని ఆ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి దీనికి విడ్డురంగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పర్యాటక వీసాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. దీనితో మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ - 13 సీజన్‌కి విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి. 

 


ముఖ్యంగా ఏప్రిల్ 15 వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, మార్చి 13 వ తేదీ నుండే ఈ రద్దు నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఈ నెల చివరి వారంలో భారత్‌ కి రావాలని ఆశిస్తున్న విదేశీ క్రికెటర్లు ఇప్పుడు ఏమి చేయలేని స్థితులలో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఇప్పటికే 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆ వైరస్ లక్షణాలతో వందల మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

 


దీనితో అసలు ఈ ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌ లు జరుగుతాయా అన్న సందేహం ఇప్పుడు నడుస్తుంది. మ్యాచులని నిర్వహించొద్దంటూ సామాజిక వేత్తలు ఇప్పటికే గళం విప్పుతున్నారు. మ్యాచ్‌ లని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది స్టేడియానికి వస్తే..? కరోనా వైరస్ మరింతగా పెరిగే అవకాశం ఉందని మద్రాస్ హైకోర్ట్‌ లో ఇప్పటికే ఒక  అడ్వకేట్ పిల్ వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: