ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్  కు కరోనా లక్షణాలు ఉన్నాయాన్న అనుమానంతో  క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో ఈ రోజు జరుగుతున్న మొదటి వన్డే కు అతన్ని పక్కకు పెట్టింది. ఇప్పటికే  రిచర్డ్ సన్ కు వైద్య బృందం కరోనా పరీక్షలు కూడా నిర్వహించగా ఈ సాయంత్రం లోగా రిపోర్ట్స్ రానున్నాయి. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనుండి వచ్చిన రిచర్డ్ సన్ ప్రస్తుతం గొంతు నొప్పి, జలుబు తో ఇబ్బంది పడుతున్నాడు దాంతో కరోనానా ఏమో అనే అనుమానంతో మిగితా ఆటగాళ్లకు దూరంగా ఉంచి రిచర్డ్ సన్ కు చికిత్స అందిస్తున్న సీఏ..  బ్యాక్ అప్ గా సీన్ అబౌట్ ను ఎంపిక చేసింది. 
 
ఇదిలావుంటే మొదటి వన్డే లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కొద్దీ రోజుల క్రితం సౌతాఫ్రికా తో జరిగిన చివరి వన్డే కు దూరంగా వున్న స్టార్ పేసర్లు  స్టార్క్ ,కమ్మిన్స్ ఈమ్యాచ్ కు అందుబాటులోకి వచ్చారు. ఇక కరోనా ప్రభావం ఈమ్యాచ్ పై కూడా పడింది. ప్రేక్షకులు ఎవరు లేకుండా ఖాళీ స్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతుంది..  ఈసిరీస్ మొత్తం అలాగే జరుగనుంది. 
 
తుది జట్లు :   
 
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ ,లబుషెన్, డి ఆర్సీ షార్ట్ , అలెక్స్ క్యారీ, మార్ష్ ,స్టార్క్ ,హేజెల్ వుడ్  ,పాట్ కమ్మిన్స్ ,ఆడమ్ జంపా 
 
న్యూజిలాండ్ : గప్తిల్, నికోల్స్, విలియమ్సన్(కెప్టెన్),టేలర్ ,లేథమ్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, బౌల్ట్,ఫెర్గుసన్, సాన్ట్నర్, సోడి, నీశమ్

మరింత సమాచారం తెలుసుకోండి: