ఇంగ్లాండ్‌లోని బర్మింహామ్ వేదికగా జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ లో మళ్ళీ భారత్ కి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే  టోక్యో - 2020 ఒలింపిక్స్ ముందర భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు మళ్లీ గదిలో పడింది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ లో వరుస విజయాలతో పీవీ సింధు ఇప్పుడు క్వార్టర్స్‌ లోకి చేరుకుంది. కొరియా దేశం షట్లర్ సంగ్ జితో తాజాగా జరిగిన మ్యాచ్‌ లో వరుస సెట్లలో 21-19, 21-15 తేడాతో పీవీ సింధు విజయకేతాన్ని ఎగుర వేసింది.

 

IHG

 


ఇది ఇలా ఉంటే ఒక వైపు పీవీ సింధు తన జోరు కొనసాగిస్తున్నా, మరో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ మాత్రం నిరాశపరిచింది. జపాన్ దేశ స్టార్ షట్లర్ అకానె యమగూచితో జరిగిన మ్యాచ్‌ లో సైనా ధరుఁగా 11-21, 8-21 తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇదివరకే పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌ లోనే పేలవ ఆటతో టోర్నీ నుంచి నిష్క్రమించగా, తాజాగా ఇంకో భారత ప్లేయర్ లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్‌ లో డెన్మార్క్ షట్లర్ విక్టర్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఇంతటితో ఇప్పుడు టైటిల్ ఆశలన్నీ పీవీ సింధుపైనే భారత్ ఎదురు చూస్తుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: