ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న కరోనా ఇప్పుడు మ‌న‌దేశాన్ని కూడా వ‌ణికిస్తోంది. భార‌త్‌లో ఇప్ప‌టికే క‌రోనా కేసులు 78 వ‌ర‌కు న‌మోదు అయిన‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. ఇక క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచ స్టాక్ మార్కెట్లు సైతం కుప్ప కూలుతున్నాయి. చైనా మార్కెట్ ఇప్ప‌టికే వ‌చ్చే ప‌దేళ్ల‌లో కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. ఇక భార‌త మార్కెట్లు కూడా ఘోరంగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. కుబేరుల సంద‌ప ఆవిరి అవుతోంది.
క‌రోనా దెబ్బ‌తో మ‌హా మ‌హా పెద్ద పెద్ద ఉత్ప‌త్తి కంపెనీలే త‌మ ఉత్ప‌త్తులు ఆపేస్తున్నాయి.

 

విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. ఇక భార‌త్‌లో ఐపీఎల్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స‌మ్మ‌ర్ వ‌స్తుందంటే క్రికెట్ ప్రియులు ఈ పొట్టి క్రికెట్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉంటారు. ఇక బెట్టింగ్ రాయుళ్ల సంబ‌రాల‌కు అంతే ఉండ‌దు. ఇక ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో ఈ పొట్టి క్రికెట్ పండగ ఐపీఎల్ సైతం వాయిదా పడింది. తమ రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించబోమని ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

 

ఇక ప్రేక్ష‌కులు లేకుండా ఐపీఎల్ నిర్వ‌హించాల‌న్న నిబంధ‌న కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఐపీఎల్-2020ని వాయిదా వేసింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఐపీఎల్ కోసం కొత్త షెడ్యూల్ వేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: