మూడు వన్డే ల సిరీస్ కోసం భారత పర్యటన కు వచ్చిన సౌతాఫ్రికా.. ఆతిథ్య జట్టు తో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెనుదిరగనుంది. ఈ సిరీస్ లో మొదటిమ్యాచ్ గురువారం ధర్మశాల లో జరగాల్సి ఉండగా వర్షం వల్ల ఒక్కబంతి కూడా పడకుండానే ఆమ్యాచ్ రద్దయింది. ఇక షెడ్యూల్ ప్రకారం మార్చి 15న లక్నో లో రెండో వన్డే ,18న కోల్ కతా లో మూడో వన్డే జరగాల్సి వుంది కానీ కరోనా దెబ్బ తో ఈ రెండు వన్డేలను బీసీసీఐ రద్దు చేసింది. నిజానికి ఈరెండు వన్డేలను ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలనుకుంది అందుకు తగ్గట్లే ఈ రోజు 4 గంటల ప్రాంతం లో టీమిండియా, లక్నోకు చేరుకుంది. అయితే కేవలం రెండు గంటల వ్యవధిలో సిరీస్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించి షాక్ ఇచ్చింది బీసీసీఐ. 
 
ఇదిలావుంటే శ్రీలంక-ఇంగ్లాండ్ లమధ్య జరగాల్సిన టెస్టు సిరీస్ కూడా కరోనా ప్రభావం వల్ల రద్దయింది దాంతో ఇంగ్లాండ్ స్వదేశానికి బయల్దేరింది. ఇక  ప్రస్తుతం ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ లమధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఒక్కటే మిగిలివుంది. అందులో భాగంగా ప్రేక్షకులను అనుమతించకుండా ఈరోజు మొదటి మ్యాచ్ ను నిర్వహించారు. మరి మిగితా రెండు వన్డేలను నిర్వహిస్తారో లేదా రద్దు చేస్తారో చూడాలి. ఇక ఈనెల 29 నుండి జరుగాల్సిన వరల్డ్ బిగ్గెస్ట్  క్రికెట్ లీగ్..  ఐపీఎల్ ను ఏప్రిల్ 15న వరకు వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి  వెల్లడించింది. ఆలోగా కరోనా ప్రభావం తగ్గితే లీగ్ నిర్వహించనున్నారు లేదంటే ఈ ఏడాది  ఐపీఎల్ లేనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: