ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా మహమ్మారి అటు రాజకీయవేత్తలు, క్రీడాకారులు, పేద, ధనిక అనే తేడా లేకుండా తన దారికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిలోకీ ప్రవేశిస్తోంది. అయితే దీని బారిన పడిన వారంతా చనిపోతారని కాకపోయినా తీవ్ర అస్వస్థతకు గురైన వారు రేపు ఉదయానికి బ్రతుకి ఉంటామో లేదో అని తీవ్ర భయాందోళనకు లోనవుతారు. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ టీం లో ఆడుతున్న ఒక ప్రముఖ ఫాస్ట్ బౌలర్ కు కరోనా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

విషయం ఏమిటంటే 14 రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణాల తర్వాత ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ ఆస్ట్రేలియా తిరిగి వచ్చాడు. అయితే అతను న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉండగా తొలి వన్డేకు అస్వస్థత కారణంగా దూరమయ్యాడు వరల్డ్ టూర్ పూర్తిచేసుకుని వచ్చిన రిచర్డ్సన్ గొంతులో మంటగా ఉండటంతో మేనేజ్మెంట్ కు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన సీఏ అతడిని దూరంగా ఉంచి టైం కు తరలించి వైద్య పరీక్షలు చేసింది.

 

అతని గొంతుకు ఇన్ఫెక్షన్ సోకినట్లు మా వైద్య సిబ్బంది చెప్పారని, ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం అతనికి  వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా టెస్టుల ఫలితాలు వచ్చాక, అతను పూర్తిగా కోలుకున్నాక, జట్టులోకి తిరిగి తీసుకుంటామని తెలిపారు. తొలివన్డేకు అస్వస్థత కారణంగా  రిచర్డ్‌ సన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా దూరంగా పెట్టింది. అతని స్థానంలో సీన్ అబ్బాట్‌ను ఎంపిక చేశారు. దీంతో ప్రపంచం మొత్తం సరదాగా చుట్టొచ్చినా రిచర్డ్సన్ కు కరోనా ఉన్నందుకే అతనిని ఆడనివ్వలేదు అని బయట పుకారు లేసింది. ఐతే ఇది ఎంత వరకు నిజమో క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: