పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగంగా ఆదివారం లాహోర్  క్వాలాండెర్స్ ,ముల్తాన్ సుల్తాన్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో లాహోర్ ఓపెనర్ క్రిస్ లిన్.. 55 బంతుల్లో 12ఫోర్లు,8 సిక్సర్ల తో 113 పరుగులు చేసి విధ్వంసం సృష్టించడం తో లాహోర్ 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 6వికెట్లనష్టానికి 186 పరుగులుచేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఖుష్ దిల్ 29 బంతుల్లో 6 సిక్సర్లు ,5 ఫోర్ల తో 70పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో ముల్తాన్ ,లాహోర్ ముందు కష్ట సాధ్యమైన లక్ష్యాన్నే ఉంచింది.
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లాహోర్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిఇచ్చారు. క్రిస్ లిన్ సిక్సర్లు, ఫోర్ల తో రెచ్చిపోవడం తో లాహోర్ 9 ఓవర్ లోనే 100పరుగులు చేసింది. ఆ ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (57) ఔటైనా కెప్టెన్ అక్తర్ తో కలిసి లిన్ 18.5 ఓవర్ల లో మ్యాచ్ ను ముగించేశాడు. అజేయ శతకంతో లాహోర్ గెలుపు లో కీలక పాత్రలో పోషించిన లిన్ కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ లభించింది. కాగా ఈ విజయంతో  లాహోర్ సెమిస్ లోకి అడుగు పెట్టింది. ఇదిలావుంటే కరోనా భయంతో ప్రపంచంలో ఎక్కడా ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్ లు జరుగడం లేదు కానీ కరోనాకు భయపడకుండా దేశవాళీ లీగ్.. పీఎస్ఎల్ నిర్వాహణను పీసీబీ కొనసాగిస్తూనే వుంది. అయితే స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించకుండా ప్రస్తుతం ఈలీగ్ ను నిర్వహిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: