సాధారణంగా మన భాష రాని వారు మనతో మాట్లాడుతుంటే పిచ్చెక్కుతుంది.. ఒక్క ముక్క అర్థం కావడం లేదు మోర్రో అని అంటారు. ప్రపంచంలో ఇంగ్లీష్ అయితే అర్థమయ్యేవాళ్లకు అర్థమవుతుంది.. మాట్లాడగారు.  ఇది యూనివర్సల్ లాంగ్వేజ్.. అయితే కొన్ని భాషలు మాత్రం ఒక్క ముక్క అర్థం కాదు.. అలాంటి వారు మన భాషలో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే వారు చేసే తప్పులకు కడుపుబ్బా నవ్వొస్తుంది. తాజాగా క్రికెట్ దిగ్గజం  క్రిస్ గేల్ చేసి కామెడీకి అక్కడ ఉన్నవారే కాదు.. ఇది చూస్తున్న నెటిజన్లు కూడా పడీ పడీ నవ్వుకుంటున్నారు. 

 

తాజాగా వెస్టిండీస్‌ క్రికెటర్ క్రిస్ గేల్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. నవ్వులు పూయిస్తోన్న ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.  కాన్ఫిడెన్స్ మేరా.. కబర్ బనేగీ తేరీ’ అనే డైలాగ్‌ని చెప్పడానికి గేల్ ప్రయత్నించాడు. ఆయన పడుతున్న తిప్పలు చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వు ఆపులేకపోయారు. 'బాగా చెప్పావు కాకా' అంటూ యువీ ఈ వీడియో పోస్ట్ చేశాడు.

 

అయితే ఇందులో గ్రీస్ గెల్ సీరియస్ గా వేలు చూపిస్తూ కొట్టే డైలాగ్ చూస్తుంటే అమ్మో మనోడు సినిమాల్లోకి బాగానే పనికి వచ్చేలా ఉన్నాడే.. అని కొంత మంది కామెంట్స్ చేస్తుంటే.. ఆ మాత్రం హిందీలో ట్రై చేస్తున్నాడు సూపర్ అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడనున్నాడు. కరోనా విజృంభణ కారణంగా ఐపీఎల్‌ ప్రారంభోత్సవం వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: