గ్లెన్ మాక్స్‌వెల్... ఈ పేరు ఒక్కటి చాలు క్రికెట్ అభిమానులకి ఆయన గురించి పెద్దగా చెప్పవలిసిన అవసరం లేదు. దీనికి కారణం ఆయన ఆట. ఆయన ఆటతో ఒక్క  ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి దేశంలో అభిమానులను సంపాదించుక్క ప్లేయర్ ఆయన. ఇకపోతే ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలోనే ఒక  ఇంటివాడు కాబోతున్నాడు. భారతదేశ సంతతికి చెందిన విని రామన్‌‌ తో తాజాగా అతను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫార్మాసిస్ట్‌ గా పనిచేస్తున్న విని రామన్‌ తో గత కొంతకాలంగా ఈ క్రికేటర్ ప్రేమాయణం నడుపుతున్న మాక్స్‌వెల్ ఇటీవల బిగ్‌ బాల్ లీగ్ సమయంలో ఆ విషయాన్ని ఆయన అందరికీ తెలిపాడు. 

 

 


అలాగే భారత సంప్రదాయాల ప్రకారం మాక్స్‌వెల్‌ తో తనకి నిశ్చితార్థం జరిగినట్లు విని రామన్ సోషల్ మీడియాలో ఆవిడ ప్రకటించారు. మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్‌ కి దూరంగా ఉంటున్న గ్లెన్ మాక్స్‌ వెల్, ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతూ మాక్స్‌ వెల్ కనిపించాడు. కాకపోతే కరోనా వైరస్ కారణంగా మార్చి 29న మొదలు అవ్వాల్సిన ఐపీఎల్, వచ్చే నెల ఏప్రిల్ 15కి వాయిదా కావడంతో ఈ గ్యాప్‌ లో ఈ ప్రేమ జంట వారి నిశ్చితార్థం కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: