గుజరాత్ రాష్ట్రానికి చెందిన సౌరాష్ట్ర కి ఆడుతున్నప్లేయర్, భారత క్రికెట్ జట్టు బౌలర్ అయిన జయదేవ్ ఉనాద్కత్ చివరకి ఒక ఇంటి వాడు అవుతున్నాడు. ఆయన త్వరలోనే  పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. చాలా రోజుల నుంచి తన పెళ్లి గురించి దాటవేస్తూ వస్తున్న ఉనాద్కత్ తాజాగా తనకు కాబోయే భార్య ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 

 


వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని జయదేవ్ ఉనాద్కత్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్బంగా రిన్నీ అనే యువతితో తనకి జరిగిన నిశ్చితార్థం ఫొటోలని ఆదివారం పోస్ట్  చేసి అందిరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు ఈ ఫాస్ట్ బౌలర్. రిన్నీని పెళ్లి చేసుకోబోతున్నానని, ఇరువురికి ఎంగేజ్మెంట్ అయ్యిందని ఉనాద్కత్ తన సోషల్ మీడియా అకౌంట్ మూలంగా పోస్ట్ చేసి తెలిపారు. వారి ఇరువురి ఈ పొటోను జతచేసి పోస్ట్ చేశాడు.

 

 

2010 సంవత్సరంలో ఉనాద్కత్ భారత క్రికెట్ టీంలోకి అడుగు పెట్టాడు. దక్షిణ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆయన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయిన అతను ఐపీఎల్ లో మాత్రం ఆల్ రౌండర్ గా చెలరేగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: