టీమిండియా మాజీ సారథి ధోనిని మళ్ళీ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని  చెప్పకనే చెప్పాడు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుతం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లు ఫామ్ లో వున్నారని ఇక ధోని ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ తీసుకున్న అతను ఏ స్థానము లో బ్యాటింగ్ చేస్తాడని ప్రశ్నించాడు సెహ్వాగ్. ఇదిలావుంటే ప్రపంచ కప్ తరువాత జట్టుకు దూరమైన ధోనిని ఐపీఎల్ లో రాణిస్తే .. ఈఏడాది  ఆస్ట్రేలియా లో జరుగనున్న టీ 20ప్రపంచ కప్ కు ఎంపిక చేస్తామని  కోచ్ రవిశాస్త్రి  పేర్కొన్న విషయం తెలిసిందే. 
 
అయితే ఇప్పుడు అసలు ఐపీఎల్ జరుగడం కష్టమేనని తెలుస్తుంది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్ కరోనా వల్ల ఏప్రిల్ 15వరకు వాయిదాపడింది.  ఆలోగా పరిస్థితి అదుపులోకి  వస్తే ఐపీఎల్ నిర్వహించే ఛాన్స్ వుంది లేకపోతే ఈఏడాది ఐపీఎల్ లేనట్లే.. మరి ఐపీఎల్ పూర్తిగా రద్దయితే ధోని మళ్ళీ టీంలోకి రీ ఎంట్రీ ఇస్తాడోలేదోనని అభిమానులు కలవరపడుతున్నారు. మరో వైపు ఏప్రిల్ లో ఐపీఎల్ నిర్వహించాలనుకున్న విదేశీ ఆటగాళ్లు అందుబాటులో వుండేది అనుమానంగానే మారింది. దాంతో ఈఏడాది ఐపీఎల్ ను జూలై -సెప్టెంబర్ మధ్య లో నిర్వహిస్తే బాగుంటుందనే యోచన లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: