భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి... క్రికెట్ మ్యాచ్ లన్నీ రద్దైపోయాయి. అందరూ సెలబ్రెటీలు ఇంటికే పరిమితమై పోయారు. హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లన్ని  రద్దు కావడంతో ఎప్పుడు బిజీ గా ఉండే క్రికెటర్లు  కరోనా నియంత్రణకు సహకరిస్తు... హాయిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ టీమిండియా యువ స్పిన్నర్ చాహల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. క్రికెట్ మ్యాచ్ లు అన్ని రద్దు కావడంతో కరోనా  వైరస్ వల్ల  హాయిగా అందరూ రెస్ట్ తీసుకుంటే... స్పిన్నర్ చాహల్  మాత్రం సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

 


 కరోనా  వైరస్ భయం లో ఉన్న అభిమానులందరికీ కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకున్నాడో  ఏమో కానీ... టిక్ టాక్ లో వీడియో తో అలరించాడు చాహల్ . ప్రస్తుతం క్రికెటర్లకు మ్యాచ్  లు  అన్నీ రద్దు కావడంతో విశ్రాంతి లభించిన సమయంలో తనకు లభించిన సమయాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు. మామూలుగానే సోషల్ మీడియాలో చాహల్  ఎంతో యాక్టివ్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే . ఇక తాజాగా మరోసారి అది నిరూపించాడు. ప్రస్తుతం చాహల్  చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో చాహల్ ను ఓ  అమ్మాయి ఆట పట్టిస్తూ వుంటుంది. 

 


 చాహల్  ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఓ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇంతలో చాహల్ తన షూ లేస్  సరి చేసుకునేందుకు కిందకి వంగుతాడు . ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న ఆ అమ్మాయి చాహల్ వెనకకు వెళ్లి దాక్కొని ఆ తర్వాత ఆ అమ్మాయి చాహల్ ను  ఆట పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక కాసేపు ఆ అమ్మాయిని వెతికిన చాహల్ సీరియస్ అవ్వగా..చాహల్ బుగ్గ నిమిరి కూల్ చేస్తుంది ఆ అమ్మాయి... కొన్ని సెకండ్ల పాటు మినీ సైజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు అందించాడు. అయితే ఈ వీడియోలో కాస్త మ్యాజిక్ ఉన్నట్లు గానే ఉంది. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా  వైరస్ నేపథ్యంలో ఇంటికి పరిమితం కాకుండా ఇలా వీడియోలు చేసి అభిమానులందరికీ ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నావ్  అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: