ప్రస్తుతం కరోనా వల్ల దేశం లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మార్చి 29 నుండి జరగాల్సిన మెగా టోర్నీ.. ఐపీఎల్ 13వ సీజన్ ను బీసీసీఐ, ఏప్రిల్ 15వరకు వాయిదా వేసింది. అయితే రోజు రోజు కు కరోనా వైరస్  చాప కింద నీరులా విస్తరిస్తుండడం తో అసలు ఈఏడాది  ఐపీఎల్ ఉంటుందో లేదో తెలియక క్రికెట్ ప్రేమికులు అయోమయంలో వున్నారు. ఇదిలావుంటే తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏకంగా ఐపీఎల్ క్యాన్సల్ అయ్యిందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.
 
నేషనల్ మీడియా తో మాట్లాడిన కిరణ్ రిజిజు ప్రస్తుతానికైతే  ఐపీఎల్ లేనట్టే అయితే  ఏప్రిల్ 15 తరువాత ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే బీసీసీఐ మా పరిధిలోకి రాదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కానీ  ఐపీఎల్ కంటే ప్రజలే  శ్రేయస్సే ముఖ్యమని ఆ విషయాన్ని ద్రుష్టి లో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని అయన సూచించారు. 
 
ఇక మరోవైపు  ఒకవేళ రానున్న రోజుల్లో కరోనా ప్రభావం తగ్గకుంటే ఐపీఎల్ ను జూలై - సెప్టెంబర్ మధ్య లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ప్రస్తుతానికి కైతే కరోనా వల్ల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా  జరగాల్సిన వివిధ  క్రీడా టోర్నీలు రద్దయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: