టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ వన్డే వరల్డ్‌ కప్ ఆడిన అనంతరం గ్రౌండ్ కి దూరమైన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికి సుమారుగా ఎనిమిది నెలల పాటు బ్యాట్‌ పట్టని ధోని, ఐపీఎల్ - 2020 సీజన్‌ కొరకు చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌ లో మాత్రం పాల్గొన్నాడు. కాకపోతే ఇదివరకే ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెంట్రల్ చెందిన కాంట్రాక్ట్ ని ధోని కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనితో ధోనీ కథ ముగిసిందని, ఇక మల్లి ఇండియాకి ఆడడం కష్టమేననే ప్రచారం బాగానే సాగింది. కాకపోతే ఐపీఎల్‌ తోనే అతని భవితవ్యం తెలుస్తుందని చాల మంది నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. కాకపోతే ఇవ్వని ఏమి పట్టించుకోని ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్ మొదలు అవుతుంది అనగా జార్ఖండ్ జట్టుతో చేరి తన ప్రాక్టీస్ ని మొదలు పెట్టాడు మనం మహేంద్రుడు.

 

 


ఇవ్వని ఇలా ఉండగా అనూహ్యంగా బీసీసీఐ గురువారం ధోనీ నవ్వుతూ ఉన్న ఫొటోను ట్వీట్ తన అధికార ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి ‘నవ్వడం మార్గం' అనే క్యాప్షన్ పెట్టింది. ఇంకా అంతే సంగతి... మన మహేంద్రుడి రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు బీసీసీఐ ట్విటర్ పై కామెంట్ల రూపంలో దండయాత్ర మొదలుపెట్టారు. ఇందులో ‘మాకు ధోనీ కావాలి.. వీ వాంట్ మహీ.. మీరేం అన్నా చేసుకోండి ధోనీ పునరాగమనం చేయాల్సిందే.. భారత జట్టులో ఉండాల్సిందే' అంటూ అనేక కామెంట్లతో తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. ప్రపంచ టీ - 20 ప్రపంచకప్ జట్టులో ధోని ఉండాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: