విరాట్ కోహ్లీ... నిజానికి ఆయన ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో..? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఆయన చేసే వర్క్ ఔట్స్. ఒక సైడ్ మ్యాచ్‌లు లేకపోయినా, ఏరోజూ ప్రాక్టీస్, జిమ్‌ ని పోనీ దాఖలాలు కనిపించవు కోహ్లీ దెగ్గర. అలాంటిది ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులలో ఈ కోహ్లీ ఎంత అప్రమత్తంగా ఉంటాడు..? 

 


ఇది ఇలా ఉంటే ఒక అమ్మాయి సాహసోపేతంగా కోహ్లీతో సెల్ఫీ కోసం ప్రయత్నించి విఫలమైంది. దక్షిణాఫ్రికాతో మార్చి 12 - 18 వరకూ జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ ని  బీసీసీఐ కరోనా దెబ్బకి పూర్తిగా రద్దు చేయడంతో, టీమిండియా ఆటగాళ్లు అందరూ వారివారి స్వస్థలాలకి చేరుకున్నారు. అయితే ఈ పరిస్థితులలో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న కోహ్లీతో సెల్ఫీ కోసం ఒక అమ్మాయి ప్రయత్నం చేసేసింది.

 

 

అక్కడ భారీ భద్రత నడుమ కోహ్లీ నడుచుకుంటూ వస్తుండగా అనూహ్యంగా అతని పక్కకి వచ్చిన అమ్మాయి తనతో సెల్ఫీ కోసం తన సెల్‌ఫోన్ ఇవ్వబోయింది. కాకపోతే ఆ అమ్మాయి తనవైపు రావడాన్ని ముందే కనుగొన్న విరాట్ కోహ్లీ తన చూపు తిప్పుకుని అలానే ముందుకు నడుచుకుంటా వెళ్లిపోయాడు. దీనితో ఆ  అమ్మాయి కూడా వెనక్కి తగ్గి వెనుతిరిగింది..


 

మరింత సమాచారం తెలుసుకోండి: